New Farm laws: నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన నేపధ్యంలో సుప్రీంకోర్టు  కమిటీ ఇప్పుడు సందేహాస్పదంగా మారుతోంది. రైతుల అభ్యంతరాల నేపధ్యంలో  ఓ సభ్యుడు తప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు ( New Farm laws ) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు గత 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రైతుల సమ్మె ( Farmers protest ) పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ( Supreme court )  తాజాగా కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ...పరిష్కారం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్, అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషిలున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నవారేనని రైతుల్నించి ఆక్షేపణ ఎదురైంది. 


తాజాగా సుప్రీంకోర్టు ( Supreme court ) ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ ( BKS president Bhupinder singh ) తప్పుకోవడం చర్చనీయాశంమైంది. రైతుల అభ్యంతరాల నేపధ్యంలో తప్పుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కమిటీ సభ్యుడిగా తనను నియమించినందుకు అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని..ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. 


Also read: Jammu kashmir: గడ్డకట్టిన దాల్ సరస్సు..అద్భుతమైన దృశ్యాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook