Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
LJP Chief Chirag Paswan Comments: బక్సర్: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ ( Chirag Paswan ) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) జైలుకు వెళ్తారని ఆయన పేర్కొన్నారు. సీఎంతోపాటు ఆయన వెనకనున్న అధికారులు సైతం ఊచలు లెక్కపెడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బక్సర్, దుమ్రాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
నితీశ్ కుమార్ రహిత ప్రభుత్వమే తమ లక్ష్యమంటూ చిరాగ్ పాశ్వాన్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో అక్రమ మద్యంతో అవినీతి జరుగుతుందంటూ ఆయన ఎన్డీఏ సీఎం అభ్యర్థిపై పలు ఆరోపణలు చేశారు. బీహార్ ఫస్ట్.. బీహారీ ఫస్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎల్జేపీకి లేదా బీజేపీకి ఓటు వేసి నితీశ్ రహిత ప్రభుత్వ కోసం సహకరించాలని చిరాగ్ పాశ్వాన్ ఓటర్లను కోరారు. అయితే తాను సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకమని.. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కే తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. Also read: MP Bypolls: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత ప్రచారం ముగిసింది. ఈ క్రమంలో ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు చెమటోడ్చుతున్నాయి.
Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe