బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూసిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ( Ram vilas paswan died ) తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళి అర్పించారు. లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. తెలంగాణ ఉద్యమం సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ ఉద్యమానికి మద్దతు పలికారని గుర్తుచేసుకున్నారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి ( Ram vilas Paswan's death ) పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
Ram Vilas Paswan passes away: న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఇక లేరు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ విలాస్ పాశ్వాన్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి చెందినట్టుగా ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ( Chirag Paswan ) ట్విటర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 4నే ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండెకు శస్త్రచికిత్స ( Heart surgery ) జరిగింది.
అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) శంకుస్తాపన చేయనున్నారు. మరో మూడు రోజుల్లో జరిగే ఈ వేడుక కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.