Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. దీంతోపాటు 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
Bihar Election Result 2020 Update: న్యూఢిల్లీ: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Bihar election results) మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే 10 గంటలకల్లా ట్రెండ్స్ వెలువడే అవకాశముంది.
అయితే ఎన్నికల పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నేతృత్వంలోని ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్‌లతో కూడిన మహాఘట్‌బంధన్‌కే అవకాశముందని పేర్కొన్నాయి. దీంతోపాటు మరికొన్ని న్యూస్ ఛానెళ్లు హంగ్ కూడా ఏర్పడవచ్చని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ-బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) భవితవ్యం కూడా తేలనుంది. అయితే బీహార్ ఎవరికి దక్కనుందో తెలియాలంటే మరికొంతసేపు ఆగాల్సిందే.
Also Read : Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడే..
దీంతోపాటు దేశంలోని 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా మరికాసేపట్లో వెలువడనున్నాయి. అన్నిచోట్ల ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్నింటికంటే.. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలపై (madhya pradesh by election results) తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని నెలల కిందట (కాంగ్రెస్ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి ) ప్రస్తుత బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ 28 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు వాటి ఫలితాలపైనే శివరాజ్‌సింగ్ ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. మద్యప్రదేశ్‌తోపాటు గుజరాత్‌లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1, తెలంగాణలో 1 (దుబ్బాక) ఉప ఎన్నికల ఫలితాలు కూడా మరి కాసేపట్లో వెలువడనున్నాయి. Also Read : Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe