Bihar Politics: నితీశ్ కుమార్ అడుగులు ఎటువైపు.. నేడు జేడీయూ కీలక సమావేశం.. ఇక బీజేపీతో తెగదెంపులేనా..?
Nitish Kumar Key Meet Today: బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముగింపు పలకబోతున్నారా అనే చర్చ జోరందుకుంది.
Nitish Kumar Key Meet Today: బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముగింపు పలకబోతున్నారా అనే చర్చ జోరందుకుంది. కొన్నాళ్లుగా బీజేపీ పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నితీశ్ కుమార్ మంగళవారం (ఆగస్టు 9) జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక భేటీకి సిద్ధమయ్యారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చే విషయం పైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జేడీయూపై బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకప్పుడు జేడీయూ జూనియర్ పార్ట్‌నర్‌గా ఉన్న బీజేపీకి ఇప్పుడు తామే జూనియర్ పార్ట్‌నర్‌గా ఉండాల్సిన పరిస్థితికి కాషాయ పార్టీనే కారణమని బలంగా నమ్ముతున్నారు. పార్టీలో చీలికలు తెచ్చి నితీశ్ కుమార్‌ను ఎటూ కాకుండా చేసే కొత్త కుట్రలకు బీజేపీ తెరలేపిందని అనుమానిస్తున్నారు.తన అనుమతి లేకపోయినా జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నప్పటి నుంచి నితీశ్‌లో అసంతృప్తి రగులుతోంది. తనకు సన్నిహితుడైన ఆర్‌సీపీ సింగ్‌ను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా జేడీయూపై బీజేపీ కుట్రలు చేస్తోందనే అనుమానంతో నితీశ్ ఆర్‌సీపీ సింగ్‌కు మరోసారి రాజ్యసభ అవకాశం కూడా కల్పించలేదు.
ఇటీవల ఆర్‌సీపీ సింగ్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వివరణ ఇవ్వాలని జేడీయూ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆర్‌సీపీ సింగ్ రెండు రోజుల క్రితం జేడీయూకి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా నితీశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేడీయూ ఒక మునిగిపోతున్న నావ అని.. ప్రధాని కావాలనే నితీశ్ కోరిక మరో ఏడు జన్మలెత్తినా నెరవేరదని వ్యాఖ్యానించారు. ఇదంతా బీజేపీ ఒక పథకం ప్రకారం చేస్తున్న కుట్ర అనే అనుమానాలు జేడీయూలో బలంగా నాటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు నితీశ్ సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశ్ మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూల మహాకూటమి అధికారంలోకి రాగా.. అంతర్గత విభేదాలతో కొన్నాళ్లకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత నితీశ్ బీజేపీతో చేతులు కలిపారు. నితీశ్ బీజేపీని వీడే పక్షంలో ఆయనకు మద్దతునిచ్చేందుకు సిద్ధమని తాజాగా ఆర్జేడీ, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నితీశ్ ఇవాళ్టి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read: Horoscope Today August 9th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ఇవాళ అదృష్టం వెన్నంటే ఉంటుంది..
Also Read: Horoscope Today August 9th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ఇవాళ అదృష్టం వెన్నంటే ఉంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook