5 Months Old Daughter Thrown in Canal For govt job: రాజస్థాన్‌లోని బికనేర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం 5 నెలల పసికందును కాలువలో విసిరేశారు. కన్న బిడ్డ కన్నా.. ఇంకా లోకమే తెలియని పసికందు కంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగమే ఎక్కువైంది. మూడో బిడ్డ లేకున్నా పర్వాలేదు కానీ బతకడానికి ప్రభుత్వ ఉద్యోగమే ముఖ్యం అనుకున్నారు. అందుకోసం కన్నపేగు బంధాన్ని కడతేర్చడానికి సిద్ధపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగానికి, సొంత బిడ్డను చంపుకోవడానికి లింకు ఏంటి ? ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న బిడ్డను ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది అనే కదా మీ సందేహం... రండి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బికనేర్‌కి చెందిన ఝాన్వర్‌లాల్ చాందసర్ గ్రామంలో స్కూల్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లోనే.. అంటే గత నెలలోనే అతడు ప్రభుత్వానికి తన ఉద్యోగం విషయంలో ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. ఆ అఫిడవిట్‌లో తనకు ఇద్దరు పిల్లలే ఉన్నట్టుగా ఝాన్వర్‌‌లాల్ పేర్కొన్నాడు. కానీ వాస్తవానికి అతడికి మొత్తం ముగ్గురు సంతానం ఉన్నారు. ఆ తర్వాతే ఝాన్వర్ లాల్‌కి, అతడి భార్యకు అసలు భయం పట్టుకుందట. తనకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారని తెలిస్తే తన ప్రభుత్వ ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని భావించిన ఝాన్వర్ లాల్.. మూడో సంతానమైన 5 నెలల వయస్సున్న బిడ్డను హతమార్చేందుకు సిద్ధమయ్యారు. 


ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్‌లో చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగం తరువాతి కాలంలో పర్మినెంట్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు మూడో సంతానం ఉండొద్దని నిర్ణయించుకున్న ఝాన్వర్‌లాల్.. ఆ పసికందును బతికి ఉండగానే సమీపంలోని నీళ్ల కాలువలో విసిరేసి వచ్చారు. పాలు తాగే పసికందును హతమార్చడంలో ఝాన్వర్ లాల్ భార్య కూడా అతడికి సహకరించింది. ఇద్దరూ కలిసి వెళ్లి బిడ్డను నీళ్ల కాలువలో పారేసి వచ్చి చేతులు దులిపేసుకున్నాం అనుకున్నారు.


అయితే, ఝాన్వర్ లాల్ దంపతులు ఆ బిడ్డను నీళ్లలో విసరడాన్ని దూరంగా ఉండే గమనించిన గుర్తుతెలియని వ్యక్తి.. ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బిడ్డ కోసం కాలువలో వెతకగా.. అప్పటికే ఆ పసికందు నీళ్లు మింగి కళ్లు మూసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ బిడ్డ ఝాన్వర్ లాల్ కూతురు అని తెలుసుకుని దంపతులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కన్న బిడ్డతో పాటే ప్రభుత్వ ఉద్యోగం పోయింది.. పరువు ప్రతిష్టలూ పోయాయి. పైగా చేసిన నేరానికి ఇద్దరూ కలిసి శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి. తల్లిదండ్రులు ఇద్దరూ బతికి ఉండి కూడా మిగిలిన ఇద్దరు సంతానం అనాథలుగా బతకాల్సిన దుస్థితి. క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆ కుటుంబాన్ని రోడ్డునపడేసింది.


ఇది కూడా చదవండి : Shocking News: ఎంత దారుణం.. కుక్కని కుక్క అని పిలిచాడని కొట్టి చంపారు


ఇది కూడా చదవండి : Husband And Wife Matters: పెళ్లాం ఊరెళ్లి తిరిగి రావడం లేదనే కోపంతో తన పురుషాంగాన్ని తనే...


ఇది కూడా చదవండి : Powdered Human Bones: పిల్లలు పుట్టడం లేదని మనిషి ఎముకల పౌడర్ కలిపిన నీళ్లు తాగించారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook