ప్రపంచవ్యాప్తంగా  'కరోనావైరస్' భయపెడుతోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఐతే 'కరోనా వైరస్'తోపాటు మరో రెండు వైరస్‌లు బీహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్ లోని మూడు  జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. పాట్నా, నలందా, నవాడా.. ఈ మూడు జిల్లాల్లో ఇప్పటికే వందలాది కాకులు మృతి చెందాయి. మరోవైపు భాగల్ పూర్,  రోహ్ తాస్ జిల్లాల్లో  స్వైన్ ప్లూ విజృంభిస్తోంది.  ఇప్పటికే ఈ జిల్లాల్లో 50 పందులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందడాన్ని బీహార్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీన్ని నివారించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ఆదేశించారు.


ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి..!!


చనిపోయిన కాకుల శాంపిల్స్ సేకరించిన పశు సంవర్ధక శాఖ అధికారులు వాటిని కోల్‌కతాలోని ప్రయోగశాలకు పంపించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి  చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు మనుషులకు వైరస్ వ్యాప్తి చెందకపోవడంతో అంతా ఊపిరి  పీల్చుకున్నారు. 


[[{"fid":"183669","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కానీ వైరస్ మనుషులకు  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బీహార్ పశుసంవర్ధక శాఖ చర్యలు ప్రారంభించింది. నిన్న వేలాది కోళ్లను చంపేసి 20 అడుగుల లోతులో పాతి పెట్టారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..