Bird Flu: రాజస్థాన్, కేరళతో పాటు నాలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
Bird Flu in Kerala: అలప్పుజా జిల్లాల్లోని కుట్టనాడ్ ప్రాంతంలో నెడుముడి, తలాకీ, పలిప్పాడు, కరువుట్టా తాలూకాలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నివేదికలు వచ్చాయి.
Bird Flu: కేరళలోని కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో బర్డ్‌ప్లూ వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్లూ సోకి మరణించిన బాతులు, ఇతర పక్షులను అధికారులు గుర్తించారు. ప్రభావిత ప్రాంతంలో ఒక కిలోమీటరు పరిధిలో పెంపుడు పక్షులు మరణాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. అలప్పుజా జిల్లాల్లోని కుట్టనాడ్ ప్రాంతంలో నెడుముడి, తలాకీ, పలిప్పాడు, కరువుట్టా తాలూకాలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నివేదికలు వచ్చాయి.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఈ మేరకు అధికారులు అలెర్ట్ అవ్వగా.. దేశంలోని (India) ఇతర ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ గురించి నిర్ధారణ చేసింది.
ఇప్పటి వరకు సుమారు 1,700 బాతులు వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) పాంగ్ సరస్సు ప్రాంతంలో 2,400 పక్షులు మరణించాయి. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 40,000 పక్షలకు వైరస్ సోకినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అధికారులు, పౌల్ట్రీ యజమానులు అప్రమత్తం అయ్యారు.
Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe