పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఒడిషాలో అధికార పార్టీ అయిన బిజు జనతా దళ్ (బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది. ఇదివరకు దేశాన్ని పదేళ్లపాటు పాలించిన యూపీఏ కానీ లేదా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కానీ గత నాలుగేళ్ల పాలనలో ఒడిషాకు చేసిందేమీ లేదని బీజేడీ ఎంపీ భర్తుహరి మహ్తాబ్ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌కి తెలిపారు. ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ వల్ల దేశ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేనందున తమ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయడానికే నిర్ణయించుకున్నట్టు భర్తుహరి స్పష్టంచేశారు. అనంతరం బిజు జనతా దళ్ సభ్యులు సభ నుంచి బయటికొచ్చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన బిజు జనతా దళ్ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ని సైతం బహిష్కరించారు. 


లోక్ సభలో మొత్తం 19 మంది సభ్యుల మద్దతుతో ఐదవ అతిపెద్ద పార్టీగా పేరున్న బీజేడీ అవిశ్వాస తీర్మానంపై తమ వైఖరి ఏంటో స్పష్టంచేయకుండానే సభ నుంచి వాకౌట్ చేసింది.