BJP MP Candidates: మాజీ ముఖ్యమంత్రికి టికెట్.. సీనియర్లకు తప్పని భంగపాటు
BJP Fifth Candidates List: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాలో పలువురికి శుభవార్త.. కాగా మరికొందరికి భంగపాటు ఎదురైంది. 111 సభ్యుల జాబితాలో తెలంగాణ, ఏపీలోని కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
BJP Candidates: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 111 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. ఐదో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఇచ్చింది. ఆ జాబితాలో మాజీ ముఖ్యమంత్రికి టికెట్ లభించగా.. పార్టీకి నమ్మకంగా ఉన్న సీనియర్ నాయకులకు చోటు దక్కింది. ఇక తెలంగాణలో రెండు స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి దక్కింది. పార్టీ సీనియర్ నాయకురాలు పురందేశ్వరికి రాజమండ్రి టికెట్ దక్కగా.. అనకాపల్లి స్థానానికి కేంద్ర మాజీ మంత్రి సీఎం రమేశ్‌కు, అరకు టికెట్ కొత్తపల్లి గీతకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తాజా జాబితాలో చోటు లభించింది. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌ను, తిరుపతికి వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మకు అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది.
Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు, పబ్‌లు బంద్
బీజేపీ ఎంపీ అభ్యర్థులు
రాజమండ్రి- పురందేశ్వరి
అనకాపల్లి- సీఎమ్.రమేశ్ (కేంద్ర మాజీ మంత్రి)
అరకు- కొత్తపల్లి గీత (సిట్టింగ్ ఎంపీ)
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి (మాజీ సీఎం)
తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎంపీ)
నరసాపురం- శ్రీనివాస వర్మ (బీజేపీ రాష్ట్ర కార్యదర్శి)
తెలంగాణ అభ్యర్థులు
తెలంగాణలోని కీలకమైన వరంగల్, ఖమ్మం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల అనేక మలుపుల మధ్య పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరీ రమేశ్‌కు ఊహించినట్టే వరంగల్ స్థానం కేటాయించింది. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది. ఖమ్మం స్థానం టీడీపీ ఆశిస్తుండగా బీజేపీ నిరాకరించి సొంత అభ్యర్థిని ప్రకటించింది.
సీనియర్లకు భంగపాటు
పొత్తులో భాగంగా ఏపీకి దక్కిన 6 స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులతో కొందరు అసంతృప్తికి లోనయ్యారు. సీనియర్ నాయకులైన జీవీఎల్ నరసింహా రావు, సోము వీర్రాజులకు భంగపాటు తప్పలేదు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో చాలా మంది చంద్రబాబు మద్దతుదారులే ఉన్నారని బీజేపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తున్న వారిని కాదని పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు దక్కాయని టికెట్ ఆశావహులు మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి