Phone Tapping: రంగంలోకి దిగిన కేంద్రం.. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలో పెనుదుమారంగా మారింది. ఇప్పటికే దీనిపై తెలంగాణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
BJP Central Minister Anurag Thakur Comments On Phone Tapping Case: దేశంలో ఒకవైపు ఎన్నికల హీట్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తెలంగాణ లో ప్రస్తుతం ఒకవైపు ఎన్నికల ప్రచారవేడీ, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం రచ్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఘటనను తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అదే విధంగా పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇక తెలంగాణలో తొలిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ చట్టాం ఆధారంగా పలువురు అధికారులపై కేసులు నమోదు చేసిన విషయంతెలిసిందే. తాజాగా, తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనపై.. కేంద్ర సమాచారం, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టం 1885 ను ఉల్లంఘించి, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలితే దీనిపై చర్యలుంటాయని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరి ఫోన్ లనైన ట్యాప్ చేయాలంటే.. కేంద్ర హోంశాఖ సెక్రటరీ, అదే విధంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి.
ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం... దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఆయాశాఖల ఆదేశలమేరకు.. రాష్ట్రంలో పోలీసులు.., ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్స్స్,సీబీడీటీ, ఢిల్లీ పోలీసులు ఆయాశాఖల అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త పోలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహరంపై కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ లీడర్ లు.. మాజీ సీఎంకేసీఆర్, కేటీఆర్ ఉన్నారని కూడా వ్యాఖ్యలుచేశారు. సీక్రెట్ గా భార్యభర్తలు మాట్లాడుకున్న విషయాలు కూడా విన్నరంటూ కామెంట్లు చేశారు. దీనిపై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి లీకులు ఇవ్వకుండా.. దమ్ముంటే ఈ వ్యవహరంలో సీఎం రేవంత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. అదే విధంగా.. ఫాన్ ట్యాపింగ్ లో తనకు ఎలాంటి సంబంధంలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తే సీఎంను, మంత్రులను ఎవర్ని వలిదిపెట్టే ప్రసక్తిలేదని కేటీఆర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి