Priyanka Gandhi tea invite offers: న్యూఢిల్లీ: టీ తాగడానికి కుటుంబ సమేతంగా రావాలంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( priyanka gandhi ) నుంచి వచ్చిన ఆహ్వానంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలునీ ( anil baluni ) స్పందించారు. తనకు టీ వద్దని, బదులుగా మీరే మా ఇంటికి డిన్నర్‌ చేయడానికి రావాలంటూ ప్రియాంక గాంధీను అనిల్ బలునీ ఆహ్వానించారు. కుటుంబంతో కలిసి విందుకు రావాలని.. మీ కోసం ఉత్తరాఖండ్‌కు సంబంధించిన అన్ని సంప్రదాయ వంటకాలను వడ్డిస్తానని ఆయన ప్రియాంక గాంధీకు హామీ కూడా ఇచ్చారు. ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని 35 లోథీ స్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అయితే కేంద్ర హోంశాఖ ఆమెకున్న ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను ఇటీవల ఉపసంహ‌రించుకుంది. Also read: Priyanka Gandhi: టీ తాగడానికి రావాలంటూ బీజేపీ నేతకు ఆహ్వానం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ప్రియాంక గాంధీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ బంగ్లాను ఆగస్టు ఒకటిలోపు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ బంగ్లాలోకి రానున్న రాజ్యసభ సభ్యుడు అనిల్ బలునీను తేనీటి విందుకు రావాలని ప్రియాంక ఆహ్వానించారు. ప్రియాంక ఆహ్వానంపై సోమవారం స్పందించిన బలునీ.. తాను కేన్సర్ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నానని, వైద్యులు ఇంట్లోనే ఉండమన్నారని పేర్కొంటూ.. బదులుగా మీరే మా ఇంటికి కుటుంబసమేతంగా విందుకు రావాలంటూ.. లేఖ రాశారు. తాను ఢిల్లీలోని లుటియెన్స్ బంగ్లాలోకి మారిన తర్వాత విందు ఉంటుందని బలునీ పేర్కొన్నారు.   Also read: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి నోటీసు


ఇదిలాఉంటే.. ప్రియాంకగాంధీ బంగ్లా ఖాళీ అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు మారాలనుకున్నప్పటికీ.. ప్రస్తుతం గురుగ్రామ్‌లో కొంతకాలం నివసించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. Also read: Haryana govt: గాంధీ- నెహ్రూ ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశం