BJP Sankalp Patra: అధికారం కోసం రాజకీయ పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి. ఎన్నికల సమయంలో భారీగా హామీలిచ్చి ఎగ్గొడుతున్న పార్టీలు.. తాజాగా మళ్లీ హామీల జాతర చేసేస్తున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా తన 'సంకల్ప పత్ర్‌'లో భారీగా హామీలు కుమ్మరించేసింది. ప్రజలను ఆశల పల్లకీలో ముంచేసింది. తన ఎన్నికల మ్యానిఫెస్టోలో నెలకు రూ.2,100 మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 25 భారీ హామీలు ఇచ్చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gas Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..!


 


జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బీజేపీ మ్యానిఫెస్టో 'సంకల్ప పత్ర్‌' కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత అధికార పార్టీ జార్ఖండ్‌ ముక్తి మోర్చాపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. 'జేఎంఎం పాలనలో జార్ఖండ్‌ అభివృద్ధికి నోచుకోలేదు. హేమంత్‌ పరిపాలనలో గిరిజనులకు భద్రత లేకుండాపోయింది' అని ఆరోపించారు.

Also Read: Chandrababu Kiss: సీఎం చంద్రబాబుకు ప్రేమతో ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్‌


 


బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అమిత్‌ షా గుర్తు చేశారు. ఈ ఎన్నికలు జార్ఖండ్‌ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని.. తాము అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని సంచలన ప్రకటన చేశారు. దుష్పరిపాలన, అవినీతిని అంతం చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్‌లో అవినీతి అంతం చేస్తామన్నారు. మట్టిని.. కుమార్తెలను, రొట్టెలను తాము కాపాడుతామని అమిత్‌ షా తెలిపారు. 'సంకల్ప్‌ పత్ర ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే పూర్తి విభిన్నం. దేశంలో, రాష్ట్రాల్లోనైనా హామీలు నెరవేర్చే పార్టీ బీజేపీ ఒక్కటే' అని అమిత్‌ షా స్పష్టం చేశారు.


జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవంబర్‌ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జార్ఖండ్‌లో జేఎంఎం పార్టీకి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉంది. అక్రమ కేసుల ఆరోపణలతో సీఎం హేమంత్‌ సోరెన్‌ను జైలుకు పంపడంతో జేఎంఎం పార్టీకి సానుకూల పరిస్థితి ఏర్పడింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook