Hike in Gas Cylinder Price: దీపావళి పండుగకు సాధారణంగా.. కేంద్ర ప్రభుత్వాలు శుభవార్త చెబుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు దీపావళి పండుగ వచ్చిందంటే గ్యాస్ ధరలు సాధ్యమైనంత వరకు తగ్గుతూ ఉంటాయి. అయితే ఈసారి ఊహించని విధంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇది కాస్త సామాన్యులకు భారంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే హోటళ్లకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర పై సుమారుగా 62 రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ ధరలు ఈరోజు నుంచి అమలు అయ్యే విధంగా గ్యాస్ సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ధరలు ఒక నెల మాత్రమే కొనసాగుతాయి మళ్లీ వచ్చే నెల ఒకటో తారీకు ఈ ధరలు మారే అవకాశం ఉంది.
అయితే ఈ మధ్యకాలంలో మూడు నెలలలోనే సిలిండర్ ధరలు అమాంతం పెరగడంతో ఈ భారం సామాన్యులపై పడిందని చెప్పవచ్చు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.
అసలే కూరగాయల ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి గ్యాస్ ధరలు పెరగడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 62 రూపాయలు పెంచడంతో.. ఒక్కో సిలిండర్ ధ1802 రూపాయలకు చేరింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో..ఇలా ధరలు పెరగడం ఒక్కసారిగా సామాన్యుడి నెత్తిన భారీ భారం పడిందని కూడా చెప్పవచ్చు.
దేశంలోని పలు నగరాలలో గ్యాస్ ధరల విషయానికి వస్తే..
1). ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1740 నుంచి రూ.1, 802 కి చేరింది.
2). కోల్కత్తాలో రూ.1850 నుంచి రూ.1,911 కి చేరినది. ప్రస్తుతం అయితే బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నట్లుగా తెలుస్తోంది. డొమెస్టికల్ సిలిండర్ల విషయంలో కూడా ఎలాంటి మార్పులు లేవట. ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున గ్యాస్ సిలిండర్.. ధరలను సైతం ఆయిల్ కంపెనీ సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలాంటి తరుణంలోనే ఈరోజు సరికొత్త ధరలను ప్రకటించాయి.