GVL Narasimha Rao: ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకుంటోందా..జీవీఎల్ ఆసక్తికర ట్వీట్..!
GVL Narasimha Rao: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం తీవ్రమవుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
GVL Narasimha Rao: టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు వెన్ను పోటు పొడిచి..ఆయన మరణానికి కారుకులైన వారు..ఇవాళ ఆయనపై అతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ప్రేమను ఒలకబోస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ను నువ్వు వారసుడివా అని వెక్కిరించడం, అవమానించడం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, దగా రాజీకాయాలకు పరాకాష్ట అని అన్నారు.
ఇటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన వైసీపీపై కూడా జీవీఎల్ విమర్శలు సంధించారు. భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్‌ను వివాదంలో లాగిన వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఆరోగ్య వర్సిటీ పేరు మార్చారని మండిపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ గారి మనసును వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టొద్దని సీఎం జగన్‌కు హితవు పలికారు.
మొత్తంగా ఎన్టీఆర్‌ను బీజేపీ ఓన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షాను సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. డిన్నర్ సమయంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో రాజకీయాల గురించి ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పుంజుకోవాలని భావిస్తున్న కమలనాథులు సినీ నటులను కలుపుకుపోతున్నారు. ఇందులో భాగంగానే పాపులర్ హీరోలను ప్రచారంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం ముదురుతోంది. ఇటీవల పేరు మార్పునకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ వర్సిటీ మార్చారు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మహా నేతలు అని..ఒకరి పేరు మార్చి మరో పెట్టినంతా మాత్రన ఆయన పేరు తరిగిపోతోందని..ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారంటూ ట్వీట్ చేశారు.
దీనిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్టీఆర్ పేరు తొలగిస్తే..వైఎస్ఆర్‌ను మహానేత అంటావా అంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను జూనియర్ వైఎస్‌ఆర్ కొందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌కు బీజేపీ బాసటగా నిలిచింది.
Also read:Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook