Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?

Nagarjuna - Venkatesh To act with Chiranjeevi in Mega 154: బాబి డైరెక్షన్లో రూపొందుతున్న మెగా 154 సినిమాలో రవితేజ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు కూడా సినిమాలో భాగమవుతున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 25, 2022, 01:27 PM IST
Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?

Nagarjuna - Venkatesh To act with Chiranjeevi in Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్ష గల ముందుకు రాబోతుంది. ఆ సంగతి అలా ఉంచితే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్త కథ కావటం, బాబి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మీద ప్రేక్షకులలో మరింత క్రేజ్ పెంచేందుకుగాను ఈ సినిమాలో వెంకటేష్, నాగార్జున కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రవితేజ పాత్ర కొంత ఎక్కువగానే ఉంటుంది కానీ వీరిద్దరి పాత్రలు అతిథి పాత్రలుగా డిజైన్ చేస్తున్నారని ప్రచారం ఉపందుకుంది.

మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున చాలా సన్నిహితులు అలాగే వెంకటేష్ తో కూడా చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరితో తమ సినిమాలో అతిధి పాత్రలు చేయిస్తే సినిమా అది అదనపు ఆకర్షణ అవుతుందని బాబీ మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారని, బాబీ నిర్ణయాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే నాగార్జున, వెంకటేష్ లను సంప్రదించి వారిద్దరి అతిధి పాత్రలను ఖరారు చేశారని తెలుస్తోంది.

మెగాస్టార్ కెరియర్ లో 154వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి సైతం పలు సందర్భాలలో నోరు జారారు. అయితే అధికారికంగా మాత్రం ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తోంది.  
 Also Read: NTR 30 Shoot: కొరటాల టెన్షన్ తీర్చేసిన ఎన్టీఆర్.. ఆ ఒక్క మాటతో అంతా క్లియర్!

Also Read: Megastar Chiranjeevi Crucial Decision: గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మెగాస్టార్ సంచలన నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x