Mukhtar Abbas Naqvi: బీజేపీ ముఖ్య నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్ కూడా పదవి నుంచి వైదొలిగారు. వీరిద్దరి రాజ్యసభ పదవికాలం రేపటితో ముగియనుంది. ఈక్రమంలోనే ఇద్దరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి రేసు కోసమే ఇద్దరు కీలక నేతలు ప్రభుత్వ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపరాష్ట్రపతి పదవి నఖ్వీకి దక్కుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నింపాలని ఎన్డీయే కూటమి యోచిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. ఉదయం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నఖ్వీ కలిశారు. అనంతరం రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి ఖరారు అయిన తర్వాతే రాజీనామా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


ఇటీవల బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ వ్యవహారంలో ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి బయట పడేందుకు ఉపరాష్ట్రపతి పదవిని మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే నఖ్వీ చేత రాజీనామా చేయించినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్ ఖాన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 


ఇప్పుడు ఆ చిట్టాలో నఖ్వీ పేరు చేరింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు అయ్యింది. ఆమె నామినేషన్లు సైతం వేశారు. త్వరలో ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియనుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయ్యింది. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవికాలం ఆగస్టు 10తో ముగియనుంది. 


Also read:CM Jagan Tour: కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..టూర్ షెడ్యూల్ ఇదే..!


Also read:ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ షో..నిరాశ పర్చిన విరాట్ కోహ్లీ..! 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook