ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు. ప్రవీణ్ పర్దేశిని అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి అదనపు చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసిన సీఎం థాకరే.. అదే శాఖలో ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఇక్బాల్ చాహల్‌ని బీఎంసి కమిషనర్‌గా నియమించారు. అదే విధంగా ముంబై బీఎంసి అడిషనల్ మునిసిపల్ కమిషనర్‌గా ఉన్న జయశ్రీ బోస్‌ని సైతం అక్కడి నుంచి బదిలీ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి ఎండీగా నియమించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల


జయశ్రీ బోస్ బదిలీతో ఖాళీ అయిన బీఎంసి అడిషనల్ మునిసిపల్ కమిషనర్ స్థానంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ మాజీ ఎండీ అశ్వినిని నియమించారు. థానె మునిసిపల్ కమిషనర్‌గా ఉండి ట్రాన్స్‌ఫర్ అయిన అనంతరం పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న సంజీవ్ జైశ్వాల్‌ని బీఎంసి అడిషనల్ కమిషనర్‌గా నియమిస్తూ మహారాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీచేసింది. దీంతో బీఎంసిలో పాత వారి స్థానంలో అంతా కొత్త వారే వచ్చి చేరారు. 


Also read : TRS MLA చెన్నమనేని రమేష్ ‘పౌరసత్వం రద్దు’పై తీర్పు వాయిదా


మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు మొత్తం 19,063కి చేరగా 731 మంది చనిపోయారు. అందులో కేవలం బీఎంసీ పరిధిలోనే 11,219 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 437 మంది చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..