TRS MLA చెన్నమనేని రమేష్ ‘పౌరసత్వం రద్దు’పై తీర్పు వాయిదా

తనకు భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని నేత చెన్నమనేని రమేష్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. తదుపరి విచారణను జూన్‌కు హైకోర్టు వాయిదా వేసింది.

Last Updated : May 8, 2020, 03:50 PM IST
TRS MLA చెన్నమనేని రమేష్ ‘పౌరసత్వం రద్దు’పై తీర్పు వాయిదా

హైదరాబాద్: టీఎర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణను కొనసాగించింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అయితే తదుపరి విచారణను జూన్ 16 వాయిదా పడింది.  పాక్ క్రికెటర్‌‌తో తమన్నా.. ఫొటో వైరల్

తనకు భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని నేత చెన్నమనేని రమేష్ హైకోర్టుకు విన్నవించుకున్నారు. నేడు ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పూర్తి వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. తెలుగింటి అందం పూజిత పొన్నాడ

కాగా, చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని, ఆ దేశ పాస్ పోర్టుతో మద్రాస్ నుండి జర్మనీ వెళ్లారని కేంద్ర హోంశాఖ గతంలోనే కోర్టుకు తెలిపింది. భారత పౌరసత్వం కలిగి ఉంటే జర్మనీ పాస్ పోర్టుతో ఎందుకు వెళ్లావని చెన్నమనేని రమేష్‌ను హైకోర్టు ఇదివరకే ప్రశ్నించింది. ఈ పౌరసత్వ వివాదంపై ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. తదుపరి విచారణలో ఏం తేలుతుందోనని ఆసక్తి ఏర్పడింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News