Mahatma Gandhi: మహాత్మా గాంధీ విషయంలో బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహాత్మా గాందీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పూణేకు చెందిన న్యాయవాది నోటీసులు పంపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ అంశంపై బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డి బర్మన్ మహాత్మా గాంధీ కంటే పెద్దవారని చెప్పిన అభిజీత్..మహాత్మా గాంధీ పాకిస్తాన్‌కు జాతి పితామహుడని ఇండియాకు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం ఎప్పట్నించో ఉందని..కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియా నుంచే ఆవిర్భవించిందన్నాడు. గాంధీని జాతిపితగా పొరపాటున పిలిచారన్నాడు. అందుకే ఇండియా మహాత్మా గాంధీకు చెందిన దేశంగా గుర్తించబడిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. పాకిస్తాన్ పొరపాటున సృష్టించబడిందని కూడా అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యానించాడు. 


ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. దేశం మొత్తం అభిమానించే జాతిపిత గాంధీని పాకిస్తాన్ పితామహుడిగా పిలిచి అవమానించినందుకు పూణేకు చెందిన న్యాయవాది ఆసిమ్ సోర్డే లీగల్ నోటీసులు పంపించారు. ఈయన తరపున మనీష్ దేశ్ పాండే అభిజీత్‌కు నోటీసులు పంపించారు. తక్షణం అభిజీత్ భట్టాచార్య క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. మహాత్మా గాంధీ ప్రతిష్ఠను దిగజార్చే వ్యాఖ్యలు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. అభిజీత్ చేసిన ప్రకటన గాంధీ పట్ల ఆయన మనసుల్లో ఉన్న ద్వేషాన్ని చూపిస్తుందన్నారు. 


అభిజీత్ క్షమాపణలు చెప్పలేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 353, సెక్షన్ 356 కింద ఫిర్యాదు చేశారు. అదే సమయంలో నెటిజన్లు కూడా సింగర్ అభిజీత్‌పై మండిపడుతున్నారు. 


Also read: 8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్, 8వ వేతన సంఘంపై ప్రకటన, డీఏ పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.