Bhagat singh rehearsal: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అమరజీవి భగత్ సింగ్ ఎందరికో స్పూర్తి. విద్యార్ధులు ప్రదర్శించే ప్రతి నాటకంలో భగత్ సింగ్ ఉరిశిక్ష సన్నివేశం తప్పనిసరి. ఆ సన్నివేశమే ఆ విద్యార్ధి ప్రాణాల్ని తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా భగత్ సింగ్(Bhagat Singh), రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు దేశం కోసం ప్రాణాలర్పించారు.అందుకే ఇప్పటికీ విద్యార్ధులు వివిధ సందర్బాల్లో భగత్ సింగ్ పాత్ర పోషిస్తుంటారు. ముఖ్యంగా భగత్ సింగ్ ఉరిశిక్ష సన్నివేశం తప్పనిసరిగా ఉంటుంది. అదే కోవలో ఈ విషాదం జరిగింది యూపీలో. ఉత్తరప్రదేశ్ బుడౌన్‌లోని బాబాత్ గ్రామంలో జరిగిన విషాదం మాటల్లో చెప్పలేనిది. అమరజీవి భగత్ సింగ్ పాత్ర పోషిస్తూ ప్రాణాలు విడిచిన విషాద ఘటన. స్వాతంత్య్ర సమరయోధుల జీవితం ఆధారంగా ఓ నాటకం కోసం యూపీలో పాఠశాల విద్యార్ధులు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివమ్ అనే 9 ఏళ్ల విద్యార్ధి భగత్ సింగ్ పాత్ర పోషిస్తున్నాడు.స్నేహితులతో కలిసి ఇంటి ప్రాంగణంలో రిహార్సల్ ప్రారంభించాడు. నాటకంలో భాగంగా భగత్ సింగ్ ఉరిశిక్ష(Bhagat singh Hanging Scene) సన్నివేశం రిహార్సల్ మొదలెట్టాడు. ఓ తాడు తీసుకుని ఉచ్చు బిగించి..మెడలో బిగించుకున్నాడు. ప్రమాదవశాత్తూ అతని పాదాలు స్టూల్ నుంచి జారిపోవడంతో ఉరి బిగుసుకుపోయింది. ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఇదంతా చూస్తున్న అతడి స్నేహితులు యాక్టింగ్ అనుకున్నారు. కానీ శరీరంలో కదలికలు లేకపోవడంతో పిల్లలు భయపడిపోయారు. స్థానికులు వచ్చి శివమ్‌ను కిందకు దించారు. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భగత్ సింగ్ ఉరిశిక్ష రిహార్సల్‌లో గత ఏడాది జరిగింది. అప్పుడు కూడా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.


Also read: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఎర్రచందనం పట్టివేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook