Brazil Protests: బ్రెజిల్‌ రాజధాని బ్రెసిలియాలో కొత్త అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఎన్నికకు వ్యతిరేకంగా మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వీధుల్లో హింసాత్మకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంట్ హౌస్) నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసనకారులు సుప్రీంకోర్టు లోపలికి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దాదాపు 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రెజిల్‌లో ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు . బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వాను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. "రాజధాని బ్రెసిలియాలోని దేశ సంస్థలలో అల్లర్లు, విధ్వంసక చర్యలు, హింసాత్మక ప్రదర్శన గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. మేము బ్రెజిల్ ప్రభుత్వానికి మేము పూర్తి మద్దతును తెలుపుతున్నాము" అని పీఎం మోదీ ట్వీట్ చేశారు. 


 




బోల్సోనారో ఎన్నికల్లో ఓటమి 


గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓడిపోగా.. లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత లూలా డ సిల్వా మూడోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బోల్సోనారో మద్దతుదారులు ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. దీంతో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సుప్రీం కోర్టు, కాంగ్రెస్, అధ్యక్షు భవనాల్లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు 400 మందిని అరెస్టు చేయడంతోపాటు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయించారు. 


అల్లరి మూకలను బోల్సొనారోనే బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు లూలా ఆరోపించారు. ఫాసిస్ట్‌ మతోన్మాదులుగా పోల్చిన ఆయన.. అల్లర్లను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు రాగా.. బోల్సొనారోకు 49.1 శాతం ఓట్లు సంపాదించారు. లూలా విజయాన్ని బోల్సొనారో మద్దతుదారులు నిరాకరిస్తున్నారు.  


శాంతియుత అధికార మార్పిడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. బ్రెజిల్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఆ దేశ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కకూడదన్నారు. భవిష్యత్‌లో లూలాతో కలిసి పనిచేయడంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు.  


Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!  


Also Read: Virat Kohli: రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి! వాల్తేరు విరాట్‌ను చూసేయండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook