Firing in Jammu & Kashmir: అక్టోబర్ 7 న గురువారం జమ్మూకాశ్మీర్‌లో (Jammu Kashmir) స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులను మరణించిన విషయం తేలిందే..! శ్రీన‌గ‌ర్ (Srinagar) జిల్లాలోని ఈద్గా సంగ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా..  ఉగ్రవాదుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మళ్లీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో జేసీవో, ముగ్గురు జవాన్లు మరణించారు. ఇలా ఉగ్రవాదులు సాధారణ ప్రజలు, సైన్యంపై నిత్యం కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా పోలీసులు ఉగ్రవాదుల స్థావరాల గురించి ముమ్మరంగా వెతకటం ప్రారంభించారు. 


Also Read: Shoaib Akhtar Comments: భారత ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. విరాట్ ఇన్‌స్టాకు దూరంగా ఉండాలి!


ఉగ్రవాదుల స్థావరాల కోసం జమ్మూకాశ్మీర్‌ పోలీసులు వెతుకుతుండగా.. పూంచ్‌ జిల్లా (Poonch) మెంధార్‌ వద్ద మళ్లీ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు చేపట్టారు. 




కాల్పులు జరుగుతున్న సమయంలో ఉద్రవాదులు దాక్కొన్న ప్రాంతాన్ని కనిపెట్టడానికి గానూ.. పోలీసులు లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను (Zia Mustafa) ఘటన స్ధలానికి తీసుకెళ్లారు. ఎదురుకాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులకు దీటుగా సీఆర్‌పీఎఫ్‌ (CRPF) జవాన్లు కూడా కాల్పులు కొనసాగిచారు. ఈ కాల్పుల సందర్భంగా.. ఒక జవాన్ కు, ఇద్దరు పోలీసులు కు గాయాలు అవ్వగా.. ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించటానికి తీసుకొచ్చిన లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను కూడా గాయాలయ్యని పోలీసులు వెల్లడించారు.  


Also Read: Nivetha Thomas: వకీల్ సాబ్ భామ సాహసం.. కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామస్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook