Terror Threat: అయోధ్య రామాలయానికి ఉగ్రదాడి ముప్పు, ఆలయం చుట్టూ సాయుధ దళాల మొహరింపు
Terror Threat: అయోద్యలో రామమందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరిలో ఆలయ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Terror Threat: అయోధ్యలో బాబ్రీ మసీదు తీర్పు తరువాత శ్రీరామమందిరం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 2024 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయం ప్రారంభం కానున్న నేపధ్యంలో ఉగ్రదాడి ముప్పు ఆందోళన కల్గిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతోంది.
అయోధ్యలో రామాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమై మూడు దశల్లో జరగనున్నాయి. మూడవ దశ 2025 డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ఇక రెండవ దశ పనులు 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. మూడవ దశలో కేవలం ఆలయ ప్రాంగణంలో గార్డెనింగ్, ఇతర సౌకర్యాలుంటాయి. మొదటి దశలో మొదటి అంతస్థు పూర్తవడంతో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది.
ఈ క్రమంలో అయోద్య రామాలయంపై అల్ ఖైదా, లష్కరే తోయిబా సంస్థలు పాకిస్తాన్ మద్దతుతో భారీగా దాడి చేయనున్నట్టు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో అయోధ్య రామమందిరం చుట్టు సాయధ బలగాలతో భద్రతను పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపధ్యంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు.
జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి తరువాత రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజులపాటు కార్యక్రమం జరపనున్నారు. మొత్తానికి అయోధ్య రామాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందనే వార్తలు ఆందోళన రేపుతున్నాయి.
Also read: Delhi Air Pollution: కరుణించిన వరుణుడు.. ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook