Delhi Air Pollution Updates: తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. వరురుణు కరుణించడంతో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్తవ్య మార్గ్, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 'కృత్రిమ వర్షం' కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయించినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్ నిపుణులను సంప్రదించారు. ఇలాంటి సమయంలోనే హఠాత్తుగా వర్షం కురవడం ఊరట కలిగించింది. నగరంలో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసేందుకు మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించింది కేజ్రీవాల్ ప్రభుత్వం.
ఇందులో భాగంగా పలువురు మంత్రులు గురువారం గురువారం ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలకు అనుసంధానించే వివిధ ప్రాంతాలు, సరిహద్దులను పరిశీలించారు. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-IV దశ జాతీయ రాజధానిలో అమలు చేస్తున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత 'తీవ్రమైన ప్లస్' కేటగిరీకి పడిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తీవ్ర కాలుష్య నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీ పాఠశాలలకు నవంబర్ 18 వరకు సెలవులు అధికారులు పొడిగించారు. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు శీతాకాల విరామం ప్రకటించింది. ఇటీవల పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు. కానీ.. వాయు కాలుష్యం నియంత్రణలోకి రాకపోవడంతో నవంబర్ 18వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ AQI 'తీవ్ర' స్థితిలో కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
తీవ్ర వాయు కాలుష్య నేపథ్యంలో ఈ నెల 20, 21వ తేదీల్లో ఢిల్లీ మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు కేజ్రీవాల్ సర్కారు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ మంత్రులు సమావేశమై చర్చించారు. కృత్రిమ వర్షం కురిపిస్తే కాలుష్యం తగ్గుతుందని ఐఐటీ బృందం ప్రతిపాదించగా.. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధం, భారీగా వాహనాలు పెరిగిపోవడం ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతోంది.
Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు
Also Read: Pakistan Semi Final Scenario: పాక్ సెమీస్‌కు రావాలంటే ఇలా జరగాలి.. టాస్‌పైనే భవితవ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook