BA.2 enters India : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్‌ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇక కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. ప్రస్తుతం అంతటా నమోదవుతోన్న కొవిడ్ కేసుల్లో ఎక్కువ శాతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌వేవ్‌కు (Omicron) సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఒమిక్రాన్‌ సబ్ వేరియెంట్ బీఏ.2 (Omicron Sub-Variant BA.2) కూడా ఇప్పుడు భారత్‌లో ప్రవేశించింది. ఈ వేరియెంట్ కొవిడ్ కేసులు ఇప్పుడు భారీగా నమోదు అవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఈ కొత్త వేరియెంట్‌కు సంబంధించి 530కి పైగా కేసులు బయటపడ్డాయి. 


ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్ అయిన బిఎ‌‌.2 (BA.2) సంబంధించిన కొవిడ్ కేసులు ఇప్పటికే బ్రిటన్‌లో చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్ బిఎ‌‌-2 ఎంట్రీ ఇవ్వడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 


అయితే ఈ సబ్-వేరియంట్ బిఎ‌‌-2 ఒమిక్రాన్ (Omicron) కంటే ఎంతో వేగంగా వ్యాపిస్తుంది. బ్రిటిష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఒమిక్రాన్ ఈ సబ్‌-వేరియంట్‌కు సబంధించిన చాలా కేసులను గుర్తించింది. యూకే హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (UKHSA) దీనికి BA.2 అని పేరు పెట్టింది.


ఇక బిఎ‌‌-2కు సంబంధించి.. దేశంలో 530 కేసులు బయటపడ్డాయి. జనవరి నెల మొదటి 10 రోజుల్లో యూకేలో కంటె ఎక్కువగానే బీఏ2 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఈ వేరియంట్‌కు సంబంధించి 400 కంటే ఎక్కువ కేసుల్ని జనవరి నెలలో మొదటి పది రోజుల్లోనే గుర్తించారు. 


భారతదేశంలో 530 ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌ బిఎ‌‌-2 కేసులు ఉండగా, స్వీడన్‌లో 181, సింగపూర్‌లో 127 కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్‌కు, దాని సబ్‌ వేరియెంట్ బీఎ.2కు పెద్దగా తేడా ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ఈ రెండింటి లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. అయినప్పటికీ బీఎ.2పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.


Also Read : Actress Switzerland Vacation: ఈ నాజూకు నడుము ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?


ఇప్పటి వరకు బీఎ.2 కేసులు దాదాపు 40 దేశాలలో బయటపడ్డాయి. డెన్మార్క్‌లో ఎక్కువగా బీఎ.2 కేసులు నమోదు అయ్యాయి. బీఎ.2 కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. బీఎ.2 వేరియెంట్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని యూకే హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ మీరా చంద్ తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌పై (New variant‌) పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బీఏ.2 స్ట్రెయిన్ 53 సీక్వెన్స్‌లను కలిగి ఉందని డాక్టర్ మీరా చంద్ పేర్కొన్నారు.


Also Read : Undavilli Arun Kumar: ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె వద్దని చెబుతున్నఉండవల్లి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook