Sharad Pawar tests positive for Covid 19: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. మూడో దశలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పలువురు సెలబ్రిటీలను కరోనా వెంటాడుతూనే ఉంటోంది. మూడో దశలో ఇప్పటికే ఎంతో మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
తనకు కరోనా సోకిందని సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా కొద్దిసేపటి క్రితం తెలిపారు. 'నాకు ఈరోజు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా వైద్యుడు సూచించిన విధంగా చికిత్స తీసుకుంటున్నా. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ స్వయంగా పరీక్షలు చేయింకొండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని శరద్ పవార్ ట్వీట్ చేశారు.
Also Read: Virat Kohli - Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన విరాట్ కోహ్లీ! ఈసారి ఏమన్నాడంటే?
I have tested Covid positive but there is no cause for concern. I am following the treatment as suggested by my doctor.
I request all those who have been in contact with me in the past few days to get themselves tested and take all necessary precautions.— Sharad Pawar (@PawarSpeaks) January 24, 2022
గతేడాది ఆగస్టులో శరద్ పవార్ ఇంట్లో మహమ్మారి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన నివాసంలోని నలుగురు కరోనా బారిన పడ్డారు. ఆయన ఇంట్లో పని చేసే వంట మనిషి, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరొకరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. శరద్ పవార్‌కు మాత్రం అప్పుడు కోవిడ్-19 నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. కరోనా సోకడంతో కొద్ది రోజుల వరకు పవార్ పలు కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook