Actress Switzerland Vacation: ఈ నాజూకు నడుము ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Actress Switzerland Vacation: సెలబ్రిటీలు అప్పుడప్పుడూ షూటింగ్ విరామాలు తీసుకుంటారు. అలా విరామంలో విహారయాత్రలకు వెళుతుంటారు. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం వెకేషన్ కు వెళ్లింది. హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఆ భామ.. ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తూ, సరదాగా గడుపుతుంది. ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 02:31 PM IST
Actress Switzerland Vacation: ఈ నాజూకు నడుము ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Samantha Switzerland Vacation: ప్రముఖ హీరోయిన్ సమంత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. హీరో నాగ చైతన్యతో వివాహ బంధానికి ముగింపు పలికిన ఈమె.. తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతోంది. ఇటీవలే తాను నటిస్తున్న కొన్ని సినిమాల షూటింగ్ లు పూర్తైన తర్వాత.. వెకేషన్ కు వెళ్లిన సమంత.. అక్కడున్న మంచు కొండలపై స్కీయింగ్ చేసింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేసింది. 

పెళ్లిబంధాన్ని తెంచుకున్న తర్వాత సమంత వరుస పెట్టి సినిమాల్లో నటించేందుకు జోరు చూపిస్తుంది. అంతే కాకుండా పాన్ ఇండియా మూవీ 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్ కు డ్యాన్స్ చేయనుందని సమాచారం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సినిమాల పరంగా.. సమంత ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' సినిమాల్లో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' ఇప్పుడే షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడామె తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటిస్తోంది. 

నాగచైతన్యతో విడాకులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. గతేడాది అక్టోబరులో తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్నారు. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందని అన్నారు.

అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని చైతూ-సామ్.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్​లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు. 

Also Read: Keerthy Suresh Photos: డిఫరెంట్ లుక్ ట్రై చేసిన కీర్తి సురేష్.. ఫొటోలు వైరల్

Also Read: Trolls on Rashmika: అయ్యయ్యో మన 'శ్రీవల్లీ' ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిందా..? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News