ఐఎస్ఐ ఏజెంట్‌తో స్నేహం చేసిన ఓ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్, ఐఎస్ఐకి కీలకమైన సమాచారాన్ని చేరవేశాడనే నేరం కింద పంజాబ్ పోలీసులు అతడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఫిరోజ్‌పూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఏప్రిల్ నుంచి సదరు బీఎస్ఎఫ్ జవాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టు తమకు స్పష్టమైన సమాచారం అందినట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని ప్రశ్నించడం కోసం అతడిని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నట్టు ఈ సందర్భంగా రంజిత్ సింగ్ మీడియాకు వెల్లడించారు.