Union Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్-2022 కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈసారి బడ్జెట్ స్వరూపం ఎలా ఉండనుందనే దానిపై ఇప్పటికే మీడియాలో పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఈసారి బడ్జెట్ ఎంతమేర ఆకట్టుకోగలదు.. వారికి ఏ మేర ప్రయోజనం చేకూర్చగలదనే చర్చ జరుగుతోంది. బడ్జెట్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఇతరత్రా అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా రికార్డు :


సాధారణంగా బడ్జెట్ ప్రసంగ సగటు సమయం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటుంది. ఇప్పటివరకూ అత్యధిక సమయం పాటు బడ్జెట్ ప్రసంగం ఇచ్చిన రికార్డు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. ఫిబ్రవరి 1, 2020న కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ఇచ్చిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. 2గంటల 42 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు. అప్పటికీ స్పీచ్ పూర్తి కాకపోయినప్పటికీ.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మిగతా స్పీచ్‌ను స్పీకర్ చదివి వినిపించారు. 


2019 బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనూ నిర్మలా సీతారామన్ 2గంటల 17 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగమిచ్చారు. ఇప్పటివరకూ అతి తక్కువ సమయం పాటు బడ్జెట్ ప్రసంగమిచ్చిన రికార్డు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి హిరూభాయి ముల్జిభాయి పటేల్ పేరిట ఉంది. 1977లో కేంద్ర ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన కేవలం 800 పదాల్లోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.


ఫిబ్రవరి 1, ఉదయం 11గంటలకు :


ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను (Budget 2022) ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు. పరిమితి సంఖ్యలో మాత్రమే బడ్జెట్ కాపీలను ముద్రించనున్నారు. లోక్‌సభ టీవీతో పాటు యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. 


Also Read: Drugs case: హైదరాబాద్​లో డ్రగ్స్​ కేసు కలకలకం- వెలుగులోకి వ్యాపారుల పేర్లు!


Also read: Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook