Drugs case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో కొంత మంది బడా వ్యాపారుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు సంచలన విషయాలు (Hyderabad Drugs cases) బయటపెట్టారు. కొత్తగా 15 మంది వ్యాపారులకు డ్రగ్స్ కేసుతో సంబందం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 7మంది వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో పేర్లు ఉన్న బడా వ్యాపారుల జాబితాలో.. సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్లు సహా పలువరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత వీరిలో చాలా మంది పరారీలో ఉన్నారని (Businessman in Drugs case) వివరించారు.
ఇప్పటి వరకు అరెస్టులు ఇలా..
ఇప్పటి వరకు పోలీలుసుల డ్రగ్స్ కేసుతో సంబంధమున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు టోనీ సహా అతడి ముఠా సభ్యులు ఇద్దరిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్లు (Hyderabad Police on Drugs case) వివరించారు.
ఎవరు ఈ టోనీ?
'టోనీ అనే వ్యక్తి నైజీరియా నుంచి వ్యాపార నిమిత్తం తొలుత ముంబయికి వచ్చాడు. విగ్గులు, వస్త్రాలు ఎగుమతి చేసే వ్యాపారాలు నిర్వహించే వాడు. అయితే అతడికి ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉండటం వల్ల.. తన వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని.. షిప్పుల్లో డ్రగ్స్ సరఫరా చేయడం (Tony Drugs case) ప్రారంభించాడు.
2009లో అతడు ముంబయికి రాగా.. 2013 నుంచి డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్నాడు. డ్రగ్స్ దందా ద్వారా సంపాధించిన డబ్బును.. వెస్ట్రన్ యూనియన్ మనీ ద్వారా నైజీరియాకు పంపించాడు.' అని పోలీసులు (Drugs case latest update) తెలిపారు.
టోనీని.. మరో పది రోజులు కస్టడీలో ఉంచాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. మరింత విచారణ జరిపితే.. ఇంకా కొత్త పేర్లు, కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశముందని తెలిపారు.
అయితే తాజాగా టోనీ ఇచ్చిన వివరాల ఆధారంగా.. బడా వ్యాపారవేత్తల గురించి విచారణ జరుపుతున్నారు.
Also read: Minister Niranjan Reddy: రెండోసారి కరోనా బారినపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి...
Also read: Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook