New Budget: 74 ఏళ్ల తరువాత ఈ తరహా బడ్జెట్ తొలిసారి..
New Budget: కేంద్ర బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 74 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సమావేశాలు ఉండనున్నాయి. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
New Budget: కేంద్ర బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 74 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సమావేశాలు ఉండనున్నాయి. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Union finance minister Nirmala sitaraman ) నేతృత్వంలో త్వరలో బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions ) ప్రారంభం కానున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థను కోవిడ్ దారుణంగా దెబ్బతీసిన నేపధ్యంలో బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్ధిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తారా లేదా అనేది తేలనుంది. బడ్జెట్ కేటాయింపుల సంగతి ఎలా ఉన్నా..బడ్జెట్ రూపం మాత్తం పూర్తిగా మారబోతోంది.
74 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇప్పటివరకూ జరగని విధంగా సమావేశాలు జరగనున్నాయి. 1947 నవంబర్ 26వ తేదీ తరువాత తొలిసారిగా బడ్జెట్ కాపీల ప్రింటింగ్ నిలిపివేస్తున్నారు. కోవిడ్ 19 భయం, కరోనా కొత్త స్ట్రెయిన్ ( New coronavirus strain ) కలకలంతో బడ్జెట్ కాపీల్ని ప్రింట్ చేయడం లేదని అధికారులు తెలిపారు. ప్రతియేటా ప్రింటింగ్ సమయంలో నిర్వహించే హల్వా వేడుకను కూడా నిలిపేస్తున్నారు. ఈసారి బడ్జెట్ కాపీలను డిజిటల్ రూపంలో ఇవ్వనున్నారు. పార్లమెంట్ లోని 750 సభ్యులకు బడ్జెట్, ఎకానమిక్ సర్వే డిజిటల్ కాపీల్ని అందించనున్నారు.
Also read: Covishield: వ్యాక్సిన్ ధర 2 వందలే..సీరమ్ - కేంద్ర ప్రభుత్వం మధ్య డీల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook