Parliament budget session 2022: ఒమిక్రాన్ ఎఫెక్ట్ (Omicron) పార్లమెంటు సమావేశాలపై పడింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పార్లమెంటు ఉభయసభలను (Parliament budget session)వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాజ్యసభ (Rajya Sabha), సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటలవరకు లోక్‌సభ (Lok Sabha) నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది. ఒకేసారి ఉభయ సభలు సమావేశమైతే కరోనా తీవ్రత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర బడ్జెట్‌ను (budget 2022) సమర్పించేందుకు ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కానుంది. అనంతరం 2వ తేదీ నుంచి 11 వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ జరగనుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోవడంతో ఆ సభకు సంబంధించిన సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌ నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ramnath Kovind) పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్‌ హాల్‌లలో సీట్లు ఏర్పాటు చేశారు.


Also Read; Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook