#WATCH: బురేవి తుఫానుతో.. చర్చి గోడలు ఎలా కూలిపోయాయో చూడండి
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Burevi Cyclone effect: చెన్నై: బురేవి తుఫాన్ ( burevi cyclone ) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 9మంది మరణించారు. భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో చాలా ఇళ్లు కూలిపోయాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావంతో ( Tamil Nadu ) రామేశ్వరం సమీపంలోని ధనుష్‌కోటిలో పురాతన చర్చి ( church building collapses ) గోడలు కూలిపోయాయి. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ చర్చి.. తుఫాను కారణంగా మరింత దెబ్బతింది. వర్షాలతోపాటు వీస్తున్న బలమైన గాలులతో ఈ చర్చి స్వరూపం ఎలా మారిపోయిందో ఈ వీడియో (Church Video) లో మీరు కూడా చూడవచ్చు. Also read: Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం
బురేవి తుఫాన్ ఈ రోజు మ.12 గంటలకు రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. Also read: Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి
Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..
Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook