Ban on firecrackers in Delhi: న్యూ ఢిల్లీ: టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నవంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) ఆ మరుసటి రోజే మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా టపాసులు కాల్చినా, టపాసులు విక్రయించినా, కొనుగోలు చేసినా.. వారిపై రూ లక్ష వరకు జరిమానా విధించనున్నట్టు తాజాగా ఢిల్లీ సర్కార్ స్పష్టంచేసింది. నవంబర్ 7 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఢిల్లీ సర్కార్ తేల్చిచెప్పింది. శుక్రవారం రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ( Minister Gopal Rai ) మాట్లాడుతూ.. టపాసుల వినియోగంపై ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు ఓ యాక్షన్ రూపొందిస్తామని, సోమవారం జరిగే సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : CCMB Warning: కరోనా వేవ్‌లు వస్తూనే ఉంటాయి..తస్మాత్ జాగ్రత్త


టపాసులపై నిషేధం విధిస్తే తాము తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు చేస్తోన్న ఆరోపణలపై మంత్రి గోపాల్ రాయ్ స్పందిస్తూ.. '' ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుంది'' అని అన్నారు. ఢిల్లీలో ఓవైపు కాలుష్యం ( Delhi Pollution ), కరోనావైరస్ కేసులు ( Coronavirus cases ) పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో టపాసులు వినియోగం పెరిగితే కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind Kejriwal ) తెలిపారు. 


Also read : Gautam Gambhir: సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి ఎంపీ గౌతం గంభీర్


ఢిల్లీలో ఇటీవల కాలుష్యం పెరిగిన కారణంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు. పరిస్థితి మరింత చేయి దాటిపోకుండా ఉండటం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని సీఎం స్పష్టంచేశారు.


Also read : JP Nadda: కరోనా విషయంలో ట్రంప్ విఫలం: బీజేపీ చీఫ్ నడ్డా