భోపాల్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.. అయితే మధ్యప్రదేశ్ లో  భోపాల్ కు చెందిన ఓ  ధనవంతుడు 180 సీట్ల A320 విమానంలో కేవలం నలుగురు మాత్రమే ప్రయాణం చేసి అందరిని ఆశ్చ్యర్యపర్చారు. కాగా వీరు భోపాల్ నుండి న్యూడ్ ఢిల్లీకి వెళ్ళడానికి అద్దెకు తీసుకున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిన నేపథ్యంలో కరోనా బారి నుండి నివారణకు ఈ నిర్ణయం తీసుకునున్నట్టు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: COVID-19:బీజేపీ నేత సంబిత్ పాత్రకు కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక..


కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు నెలల నుండి భోపాల్‌లో చిక్కుకున్న తన కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు వారి పనిమనిషిని ఢిల్లీకి తీసుకువచ్చేందుకు భోపాల్ మద్యం వ్యాపారి చార్టర్డ్ ఫ్లైట్ వినియోగించినట్టు పేర్కొన్నారు. మరోవైపు విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్‌బస్-320ను అద్దెకు అయిన ఖర్చు సుమారు రూ .20 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. కరోనావైరస్-లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల విరామం తర్వాత దేశీయ వాణిజ్య విమాన సేవలు సోమవారం నుండి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..