లాక్‌డౌన్ పాటించను.. MamataBanerjeeకి బీజేపీ నేత సవాల్

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విధిస్తున్న లాక్‌డౌన్ నియమాలను తాము పాటించలేమని, మీరు ఏం చేస్తారో చూస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు. 

Updated: May 28, 2020, 02:21 PM IST
లాక్‌డౌన్ పాటించను.. MamataBanerjeeకి బీజేపీ నేత సవాల్

రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను తాను పాటించనంటూ బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విధిస్తున్న లాక్‌డౌన్ నియమాలను తాము పాటించలేమని, మీరు ఏం చేస్తారో చూస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు.  ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు

అసలేం జరిగింది..
అంఫాన్ తుఫాన్ వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అతలాకూతలైంది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు తుఫాన్ బాధితులకు సాయం చేయాలని భావించారు. అయితే తుఫాను బాధితులకు సాయం చేసేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణులను అధికార టీఎంసీ పార్టీ వారు అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులను అనుమతి కోరగా బీజేపీ నేతలకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. ‘జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు’

 

కేవలం అధికార టీఎంసీ పార్టీ నేతల్ని మాత్రమే బయట తిరిగేందుకు అవకాశం ఇస్తున్నారని, ప్రతిపక్ష బీజేపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్న తనతో పాటు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన

బాధితులకు సాయం చేయడానికి బీజేపీ నేతలు వెళ్తుంటే మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని, పోలీసులకు అదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. బాధితులను ఆదుకునే విషయంలోనూ మమతా బెనర్జీ రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ఇలాగే కొనసాగితే తాము లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘిస్తామని దిలీష్ ఘోష్ అన్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి