పౌరసత్వ సవరణ చట్టం ( Citizenship Amendment Act ) ను త్వరలో అమలు కానుంది. ఏళ్ల తరబడి భారతీయ పౌరసత్వం ( Indian Citizenship ) కోసం ఎదురుచూస్తున్న ముస్లిమేతర శరణార్ధుల కల నెరవేరబోతోంది. భారతీయ జనతా పార్టీ ఛీఫ్ జేపీ నడ్డా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పౌరసత్వ సవరణ చట్టం ( CAA ) పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ లో అల్లర్లు ( Delhi Riots ) హింస చెలరేేగాయి. అయితే కరోనా వైరస్ ( Coronavirus ) లాక్డౌన్ కారణంగా నిరసనలు ఆగిపోయాయి. ఇదే వైరస్ కారణంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆలస్యమైంది. ఇప్పుడు త్వరలో సీఏఏ ను అమలు చేయనున్నట్టు బీజేపీ ఛీఫ్ జేపీ నడ్డా ( Bjp Chief J P Nadda ) ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి సామాజిక సమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఏఏతో దేశ ప్రజలందరికీ మేలు చేకూరుతుందని, దీనికోసం​ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 


మరోవైపు పశ్చిమ బెంగాల్ ( West Bengal )‌ సీఎం మమతా బెనర్జీ ( Cm Mamata Benerjee ) ప్రభుత్వంపై నడ్డా విమర్శలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం  ( TMC Government ) రాష్ట్రంలో విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ దేశ ప్రజలందరి వికాసానికి పాటుపడుతుందని స్పష్టం చేశారు. వచ్చేఏడాది పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేపీ నడ్డా ఉత్తర బెంగాల్‌లోని పలు ప్రాంతీయ, సామాజిక​ బృందాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు పధకాలు, నిర్ణయాల గురించి ప్రస్తావించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజ్‌ కింద రైతు సంఘాలు, వ్యవసాయ మౌలిక వసతుల ఏర్పాటు కోసం లక్ష కోట్లను కేటాయించామని చెప్పారు. స్ధానిక ఉత్పత్తులను గుర్తించడం, మార్కెటింగ్ కోసం రోడ్‌మాప్‌ను రూపొందించడం చేయాలని బీజేపీ ఎంపీలను కోరారు. 


పౌరసత్వ సవరణ చట్టం నియమాలు, నిబంధనల్ని రూపొందించేందుకు మూడు నెలల సమయం పడుతుందని ఆగస్టులో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. పార్లమెంట్ ఈ చట్టాన్ని రూపొందించినా...నిబంధనలు తయారు కాకపోవడంతో అమల్లోకి రాలేదు. 


2014 డిసెంబర్ 14కు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్నించి ఇండియాకు వలస వచ్చిన ముస్లిమేతర మతస్థులందరికీ భారతీయ పౌరసత్వం కల్పించేదే పౌరసత్వ సవరణ చట్టం. Also read: Chinese Soldier Captured: ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన చైనా సైనికుడు