Zycov D First children vaccine: దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. అత్యవసర అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు విదేశీ వ్యాక్సిన్లు స్వదేశంలో ఉత్పత్తి అవుతుండగా..మరొకటి మేకిన్ ఇండియా వ్యాక్సిన్(Make in india Vaccine). కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పుడు మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా(Zydus Cadila) అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి చేసుకుంది. జైకోవ్ డి వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇస్తే దేశంలో అందుబాటులో రానున్న నాలుగవ వ్యాక్సిన్ కానుంది.


అంతేకాదు ఈ వ్యాక్సిన్‌ను 12 ఏళ్లు దాటినవారిపై కూడా ట్రయల్స్ (Trials on Children) నిర్వహించడం, సత్ఫలితాలనివ్వడంతో  చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే అవుతుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుట్నిక్ వి వ్యాక్లిన్లలా రెండు డోసులు కావు. జైకోవ్ డి వ్యాక్సిన్‌కు(Zycov D Vaccine) మూడు డోసులుంటాయి. తొలి డోసు వేసుకున్న నెల రోజులకు రెండవ డోసు, తరువాత మరో నెల రోజులకు మూడవ డోసు తీసుకోవల్సి ఉంటుంది. డీసీజీఐ (DCGI) అనుమతి లభిస్తే..తొలి చిన్నారుల వ్యాక్సిన్ కానుంది. 


Also read: Fake Covid19 Test Lab: కుంభమేళాలో నకిలీ కోవిడ్ టెస్ట్‌ల్యాబ్, దర్యాప్తుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook