Fake Covid19 Test Lab: ఉత్తరాఖండ్ మహా కుంభమేళాలో ఏం జరిగింది..కోవిడ్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయా..ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించడానికి కారణాలేంటి..మేళా నిర్వాహకులు ల్యాబ్‌లను ఎలా నిర్వహించారు.. ఈ ప్రశ్నలిప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఏప్రిల్ నెలలో జరిగిన మహా కుంభమేళా (Maha Kumbhmela) ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభమేళాకు దాదాపు 70 లక్షలమంది భక్తులు హాజరై ఉంటారని అంచనా ఉంది. కోవిడ్ సంక్రమణ జరగకుండా ఉండేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు 13 ప్రైవేట్ టెస్ట్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా..మేళా నిర్వాహకులు మరో 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ల్యాబ్‌కు వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసుకోవాలనేది నిబంధన. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ టెస్ట్‌ల్యాబ్ (Fake Covid19 Test Lab) చేసిన మోసం వెలుగుచూసింది. హర్యానాకు చెందిన ఓ ల్యాబ్ అధికారుల్ని మోసం చేసినట్టు వెల్లడైంది. కోవిడ్ టెస్టులు చేసినట్టు కేవలం కాగితాలపై చూపించారని ప్రధాన ఆరోపణ. ఎంతమంది భక్తులకు నిజంగా కోవిడ్19 పరీక్షలు చేశారనే వివరాలు లేకుండానే నివేదిక సమర్పించారని తెలిసింది.ఈ వ్యవహారంలో భారీగా డబ్బుల లావాదేవీ జరిగినట్టు అనుమానం. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో దర్యాప్తుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం(Uttarakhand Government) ఆదేశించింది.
ఈ నకిలీ టెస్ట్‌ల్యాబ్ వ్యవహారంలో స్థానికుల ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ల్యాబ్‌లో పరీక్షలు(Covid19 Tests)చేయించుకున్నవారి వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం వ్యవహారంపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తులో రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Also read: Bomb Threat: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్, అదుపులో నిందితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook