దేశీయ రైల్వే టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC) రైల్వే కౌంటర్ నుండి టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రయాణీకులకు భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు, కౌంటర్‌లో టిక్కెట్లను కొని.. అనివార్య కారణాల వల్ల ప్రయాణం చేయని వ్యక్తులు వారి టికెట్‌ను రద్దు చేసుకోవడానికి రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు వారు కౌంటర్ వద్ద తీసుకున్న టికెట్లనూ ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు, ఈ సదుపాయం ఆన్‌లైన్‌లో కొన్న టిక్కెట్లకు మాత్రమే వర్తించేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలా?


రైల్వే కౌంటర్ నుంచి టికెట్‌ను కొన్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. టికెట్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవాలనుకొనేవారు IRCTC వెబ్సైట్లోకి వెళ్లి మెనులో 'trains' ఆప్షన్‌ను ఎంచుకొని దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో మీరు 'cancel  ticket'  అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మీకు 'ఈ-టికెట్స్/ఐ-టికెట్స్', 'కౌంటర్ టికెట్' అనే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి.


[[{"fid":"174289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"174290","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"174291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"174292","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


'కౌంటర్ టికెట్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తరువాత మీరు రద్దు చేయాలనుకుంటున్న టికెట్టు PNR నంబర్, రైలు నంబర్‌ను నింపి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీరు రిజర్వేషన్ చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నంబరుకు OTP వస్తుంది.  ఆ OTPని ఎంటర్ చేసి 'cancel  ticket' బటన్‌పై  క్లిక్ చేస్తే మీ టికెట్ రద్దవుతుంది.


రిఫండ్ పొందడం ఎలా?


టికెట్ రద్దయ్యాక మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో రద్దు చేయబడిన PNR నంబర్, రిఫండ్ అమౌంట్ గురించి సమాచారం ఉంటుంది. ఏ స్టేషన్‌లో అయితే మీరు టికెట్‌ను బుక్ చేసుకున్నారో లేదా సమీపంలోని ప్రయాణీకుల రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్ వద్దకు వెళ్లి ఈ మెసేజ్‌ను, మీ ఐడీ ఫ్రూప్‌‌తో చూపిస్తే రిఫండ్ అమౌంట్ తీసుకోవచ్చు.