CBSE 10th/12th Class Results: వీటి ఆధారంగా సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు
CBSE 12th/10th Class Results 2021: సీబీఎస్ 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మరియు 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారనే విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపింది.
CBSE 10th Class Results, CBSE 12th Class Results: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) మొదటగా టెన్త్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసింది. ఇటీవల సీబీఎస్ఈ ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్స్ సైతం రద్దు చేయడం తెలిసిందే. విద్యార్థులకు సంబంధించిన రిపోర్టును సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ గురువారం నాడు అందజేసింది.
సీబీఎస్ 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మరియు 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారనే విషయాలను సుప్రీంకోర్టుకు తెలిపింది. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టర్మ్ ఎగ్జామ్స్‌లో 5 పేపర్లలో బెస్ట్ 3 మార్కులను పరిగణిస్తామని బోర్డు పేర్కొంది. అదే విధంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు యూనిట్, టర్మ్ ఎగ్జామ్స్ మరియు ప్రాక్టికల్స్ (CBSE Class 12 Board Exams 2021)లో మార్కులను సైతం పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టుకు వివరించింది.
Also Read: TS Entrance Exams 2021 Postponed: తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదాకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం
సీబీఎస్ఈ 12 తరగతి విద్యార్థుల ఫలితాలను 10 తరగతి మార్కులను 30 శాతం వెయిటేజీ, ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 30 శాతం వెయిటేజీ మరియు సెకండియర్‌లో ఇప్పటివరకూ జరిగిన పరీక్షల ఫలితాలను 40 శాతం వెయిటేజీగా తీసుకుని CBSE 12th Class Results ఆధారంగా మార్కులు లేదా గ్రేడ్స్‌గా ప్రకటించనున్నామని సుప్రీంకోర్టు(Supreme Court)కు వివరించింది. విద్యార్థుల ఫలితాలను జూలై 31, 2021న ప్రకటించనున్నామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. సీబీఎస్ఈ ప్రకటించే ఫలితాలు సంతృప్తిగా లేకపోతే అలాంటి విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షంగా నిర్వహించేందుకు సీబీఎస్ఈ సిద్ధమని వెల్లడించారు.
Also Read: Also Read: Summer holidays: తెలంగాణలో సమ్మర్ హాలీడేస్ పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook