CBSE Class 12 Board Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దుపై Supreme Court విచారణ వాయిదా

CBSE Class 12 Board Exams 2021: దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో సీబీఎస్ఈ 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మే 31వ తేదీన ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 28, 2021, 01:05 PM IST
  • సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌
  • మే 31వ తేదీన ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను జూన్ 1న కేంద్ర విద్యాశాఖ ఖరారు చేయనుంది
CBSE Class 12 Board Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దుపై Supreme Court విచారణ వాయిదా

CBSE Class 12 Board Exams 2021 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డ్ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఇప్పటివరకూ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మే 31వ తేదీన ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో సీబీఎస్ఈ 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించింది. ఆ వ్యాజ్యం తదుపరి విచారణను మే 31వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ (CBSE Class 12 Board Exam 2021) షెడ్యూల్‌ను జూన్ 1న కేంద్ర విద్యాశాఖ ఖరారు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. 

Also Read: India Corona Cases Today: భారత్‌లో 44 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన తరువాత సుప్రీంకోర్టు తమ తుది తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్, కోవిడ్19 పరిస్థితులను గమనించి కేంద్రం రెండు ప్రతిపాదనలు చేసింది. కేవలం ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం ఓ నిర్ణయం కాగా, పరీక్షా సమయాన్ని 3 గంటల నుంచి కేవలం గంటన్నరకు కుదించాలంటే రెండో ప్రతిపాదన చేసింది. మే 31న సుప్రీంకోర్టు తీర్పుపై సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. 

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 28, 2021, ఓ రాశివారికి ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News