CBSE Class 12 Board Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ తుది నిర్ణయం ఎప్పుడంటే
CBSE Class 12 Board exams 2021 Final Decision:
CBSE Class 12 Board Exams 2021 Final Decision: సీబీఎస్ఈ మరియు ఐసీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై తుది నిర్ణయం మరో రెండు రోజుల్లో తీసుకోనున్నామని కేంద్రం తెలిపింది. కరోనా నేపథ్యంలో 12 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై నిర్ణయాన్ని కోరగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
కేంద్రం సమయం కోరడంతో సీబీఎస్ మరియు ఐసీఎస్‌ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై దాఖలైన పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసింది. గత ఏడాది సైతం ఇలాంటి పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు (CBSE Class 12 Board Exams) చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం స్వీకరించింది. నేడు పిటిషన్ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధర్మాసనం కోరింది. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం అనంతరం సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌పై తుది తీర్పు వెల్లడించనుంది.
Also Read: Corona Third Wave: మహారాష్ట్రలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందా...అంతమందికి కరోనా
కరోనా కేసుల నేపథ్యంలో అటు ఆఫ్‌లైన్, ఇటు ఆన్‌లైన్ వేదికలలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించడం వీలుకాదని న్యాయవాది మమతా శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు సీబీఎస్ఈ మరియు ఐసీఎస్ఈ విద్యార్థుల 12వ తరగతి ఫలితాలలో జాప్యం జరిగితే విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు దొరకడం కష్టతరం కానుందని ప్రస్తావించారు. 12 లక్షల విద్యార్థుల భవితవ్యం పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉందని, కనుక కరోనా (CoronaVirus) కొనసాగుతున్నా నిర్ణీత గడువులోగా పరిష్కారం సూచించాలని కోరారు.
Also Read: Gold Price Today In Hyderabad 31 May 2021: మిశ్రమంగా బంగారం ధరలు, రూ.5,000 మేర పుంజుకున్న వెండి ధర
కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 14న సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణను వాయిదా వేశారు. మరోవైపు జూన్ 1వ తేదీన కేంద్ర విద్యాశాఖ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook