CBSE New Rules: దేశవ్యాప్తంగా అత్యధికంగా విద్యార్ధులు ఫాలో అయ్యేది సీబీఎస్ఈ విధానం. ఇప్పుడీ విధానంలో ఊహించని మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలు అమల్లోకి వస్తే సీబీఎస్ఈ విధానం మరింత కఠినతరం కానుంది. విద్యార్ధులకు ఒత్తిడి పెరగనుంది. సీబీఎస్ఈ 12వ తరగతి మార్కులు ఇతర తరగతి మార్కులపై ఆధారపడి ఉండవచ్చు. అదేంటని ఆశ్చర్యపోవద్దు. నిజం కావచ్చు కూడా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విద్య విధానంలో అమలయ్యేది NCERT సిలబస్. ఈ NCERT విభాగమైన PARAKH తాజాగా ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికే ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ నివేదిక చేసిన కొన్ని సిఫార్సులు అమలైతే విద్యార్ధులకు మరింత కష్టం కావచ్చు. ఈ నివేదిక ప్రకారం సీబీఎస్ఈ 12వ తరగతి రిపోర్ట్ కార్డుకు 9, 10, 11వ తరగతి మార్కులు యాడ్ అవుతాయి. రానున్న రోజుల్లో సీబీఎస్ఈలో ఇకపై 9, 10, 11వ తరగతుల్లో వచ్చే మార్కులు ప్రామాణికం కానున్నాయి. PARAKH సమర్పించిన నివేదిక ప్రకారం 9, 10, 11వ తరగతుల్లో వచ్చే మార్కుల్ని 12వ తరగతి రిపోర్ట్ కార్డులో జత చేస్తారు. అంటే 12వ తరగతి ఫలితాలు  అంతకు ముందు మూడేళ్లు అంటే 9, 10, 11 తరగతుల్లో వచ్చే మార్కుల్ని బట్టి ఉంటాయి.


PARAKH నివేదిక ఏం చెబుతోంది


ఈ నివేదిక ఇప్పటికే కేంద్ర విద్యా శాఖకు సమర్పించారు. 12వ తరగతి పరీక్ష ఫలితాలను 9,10,11 వ తరగతుల్లో ప్రతిభ ఆధారంగా, మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే ఈ మూడేళ్లలో 9, 10, 11 తరగతుల్లో మంచి మార్కులు సాధిస్తే 12వ తరగతి తుది పరీక్ష ఫలితాల్లో ప్రయోజనం కలుగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే గ్రేస్ మార్కుల వంటిది. 12వ తరగతి తుది రిపోర్టులో 9,10,11 వ తరగతి ప్రతిభను లెక్కించి చేర్చాల్సి ఉంటుంది. అంటే వెయిటేజ్ మార్కులుంటాయి. 9వ తరగతి నుంచి 15 శాతం వెయిటేజ్, 10వ తరగతి నుంచి 20 శాతం, 11వ తరగతి నుంచి 25 శాతం వెయిటేజ్ ఉండాలనేది రిపోర్ట్ సారాంశం. ఇది కాకుండా కంబైన్డ్ అసెస్‌మెంట్ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఉంటుంది. 


ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ట్రాల స్కూల్ బోర్డులకు షేర్ చేయనుంది. అందరూ ఈ విధానాన్ని అంగీకరిస్తే త్వరలో అమల్లోకి రావచ్చు. 


Also read: Health Juice: రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు, అధిక బరువు సహా అన్ని సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook