Health Juice: బీట్ రూట్ సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. సలాడ్ లేదా ఫ్రై కింద వినియోగిస్తుంటారు. ఇంకొంతమంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. ఇందులో పోషకాలకు కొదవ లేదనే చెప్పాలి. ఇందులో లేని పోషకం లేదంటే ఆశ్చర్యం లేదు. బీట్ రూట్ లో ఐరన్, డైటరీ ఫైబర్, నేచురల్ షుగర్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలా చాలానే ఉంటాయి. అందుకే అన్ని లాభాలు కలుగుతాయి. అయితే రోజూ పరగడుపున జ్యూస్ చేసుకుని తాగాల్సి ఉంటుంది.
బీట్ రూట్ జ్యూస్ రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఇందులో పోషకాలు శరీరానికి అందుతాయి. శరీరంలో వివిధ పోషకాల సంగ్రహణ కూడా వేగవంతమవుతుంది. ఫలితంగా ఎలాంటి పోషకాల లోపం తలెత్తదు. ప్రత్యేకించి విటమిన్లు, మినరల్స్ లోపం ఉండదు. యూరిన్ ఇన్ ఫెక్షన్ సమస్యను అద్బుతంగా పరిష్కరిస్తుంది. యూరిన్ పూర్తిగా రాకపోవడం లేదా యూరిన్ వెళ్లేటప్పుడు మంట ఉండటం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు రోజూ క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
బరువు నియంత్రణ
అధిక బరువు తగ్గించుకునేందుకు, బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు బీట్ రూట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే రోజూ ఉదయం వేళ పరగడుపున తాగాలి. ఇందులోని డైటరీ ఫైబర్ కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ తినకుండా ఉంటారు. దాంతో బరువు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో నీటి కొరత లేకుండా చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే బాడీ హైడ్రేట్ అవుతుంది.
Also read: Knee Pain Tips: మోకాలు నొప్పులు బాధిస్తున్నాయా, పైసా ఖర్చు లేకుండా పోగొట్టవచ్చు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook