వరి వార్: కేంద్రంపై కేసీఆర్ ప్రశ్నల వర్షం.. కుండబద్దలు కొట్టిన సర్కార్.. ఏమన్నారంటే..??
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మహా ధర్నాలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో హడలెత్తించిన విషయం తెలిసిందే!.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
Center Response to CM KCR Protest: టీఆర్‌ఎస్ (TRS) అధినేత తెలంగాణ (Telangan) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇందిరాపార్క్ వద్ద ఈ రోజు మహా ధర్నా (Maha Dharna) చేసిన సంగతి తెలిసిందే! టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ శ్రేణులతో మహా ధర్నాలో పాల్గొని, గవర్నర్ కు వినతీ పత్రం కూడా సమర్పించిన సంగతి తెలిసిందే! వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీఆర్.. 48 గంటల్లోగా వరి కొంటారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) స్పందించింది. ఎంత వరకు ధాన్యం కొనుగోలు చేయాలో చర్చించి ప్రకటిస్తామని తెలిపింది. గత సంవత్సరం.. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇపుడు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపింది.
Also Read: స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!
అయితే ఇక బాయిల్డ్ రైస్ (Boiled Rice) కొనుగోలు చేయమని ఖరాఖండిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల ప్రజలందరి దృష్ట్యా వివైద్యమైన పంటలు అవసరమని, రైస్ పంట ఎక్కువగా సాగు అవుతున్నాయని.. వాటి నిల్వలు ఎక్కువ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. పారా బాయిల్డ్ రైస్ 44 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని.. ఇంకా ఆ కొనుగోలు పూర్తి అవ్వనేలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు పారా బాయిల్డ్ సాగు చేసి, తగినంత సమకూర్చుకుంటున్న కారణంగా ఈ రకం రైస్ కు డిమాండ్ లేదని స్పష్టం చేసింది. పారా బాయిల్డ్ రైస్ ఇకపై కొనలేమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది వరకే తెలిపాము.. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించటం కూడా జరిగిందిని తెలిపింది. వరి, గోధుమ పంట రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉందని.. పప్పు దినుసులు, నూనె గింజలను బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.. వీటికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది... కావున రాష్ట్రాలు వీటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read: వైరల్: ఎదురుగా పెద్ద మొసలి.. చెప్పు చూపించిన మహిళ.. మొసలి పరుగో..పరుగు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook