Exit Polls Banned: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 7 దశల్లో ఎన్నికలు జరిపించేందుకు షెడ్యూల్ విడుదల కాగా తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరి కొద్దిరోజుల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు, మీడియ సంస్థలకు షాక్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకూ అంటే ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్ట్ నిర్వహించడం లేదా ప్రసారం చేయడం లేదా ప్రచురించడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం తాజాగా నోటిపికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్ 19న మొదటి దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ జరగనుంది. సాధారణంగా మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎన్నికల రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి. కానీ ఎన్నికల సంఘం ఈ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విదించింది. చివరి దశ పోలింగ్ జూన్ 1 సాయంత్రం 6.30 గంటల తరువాతే ఎగ్జిట్ పోల్స్ ప్రచురించవచ్చు. 


దేశంలో ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ ఎన్నికలు, ఏప్రిల్ 26న రెండవ దశ, మే 7వ తేదీన మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదవ దశ, మే 26న ఆరవ దశ, జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో అంటే మే 13న జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విదించడంతో ఇక జూన్ 1 సాయంత్రం వరకూ సర్వే, మీడియా సంస్థలు నియంత్రణలో ఉండాలి. ఏ విదమైన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు. 


Also read: AP DSC 2024 Postponed: ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా, తిరిగి ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook