Five state Elections: ఇక జమిలి ఎన్నికల ప్రస్తావన లేనట్టే. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుుతన్నాయి. త్వరలో షెడ్యూల్ విడుదల కావచ్చు. నవంబర్ నెలాఖరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌లా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ జమిలి ఎన్నికలుంటాయని, అప్పటి వరకూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుండకపోవచ్చనే వాదన విన్పించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేనట్టే. తెలంగాఁణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెలలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదలై, నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసి మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరిపించాలనేది ఎన్నికల సంఘం ఆలోచనగా ఉంది. ఈ నెల 8-10 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని సమాచారం. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు పూర్తి చేసి డిసెంబర్ 2వ వారంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవచ్చని తెలుస్తోంది. 


ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని ఒకే తేదీన నిర్వహించకుండా ఒక్కొక్క రాష్ట్రం ఎన్నికను ఒక్కో తేదీ కేటాయించవచ్చని సమాచారం. దీనివల్ల సంబంధిత రాష్ట్రంలో ఫోకస్ పెట్టేందుకు ఎన్నికల సంఘానికి వీలవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఉంటే మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైపోయింది. బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్ధుల్ని ఖరారు చేయగా కాంగ్రెస్, బీజేపీలు ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. 


Also read: LPG Distributor Commission: గ్యాస్ సిలిండర్‌పై రూ.73 కమీషన్ పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook