Madras High Court: దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం కానున్నాయని..ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టుకు కేంద్రం నివేదించిన అంశాలివి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత (Vaccine Shortage) తీవ్రంగా ఉంది. రెండే కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం, వాటి సామర్ధ్యం సరిపోకపోవడంతో సమస్య ఎదురవుతోంది. తమిళనాడు, పుదుచ్చేరిలలో కోవిడ్ నిర్వహణపై మద్రాస్ హైకోర్టు సుమోటాగా తీసుకున్న కేసుతో పాటు మరికొన్ని కేసుల్ని జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తిల ధర్మాసనం విచారించింది. ఈ విచారణలో భాగంగా కేంద్రం(Central government) అఫిడవిట్ సమర్పించింది మద్రాస్ హైకోర్టుకు. ఈ అఫిడవిట్‌లో డిసెంబర్ నాటికి దేశంలో 216 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో రానున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.


సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute), భారత్ బయోటెక్‌తో(Bharat Biotech) పాటు క్యాడిలా(Cadila) వంటి సంస్థలు ఉత్పత్తి పెంచనున్నాయని..ఆ మేరకు డిసెంబర్ నెలలోగా 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఈ వ్యాక్సిన్ దేశంలో అందరికీ సరిపోతుందని పేర్కొంగది. సమాజంలో వివిధ నమ్మకాలతో వ్యాక్సిన్ తీసుకోనివారున్నారని...వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాస్ హైకోర్టు (Madras High Court) సూచించింది. రాష్ట్రాల జనాభా, పాజిటివిటీ రేటును అనుసరించి వ్యాక్సిన్ కేటాయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. విచారణను ఈనెల 27వ తేదీకు వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు.


Also read: Ramdev Baba: రాందేవ్ బాబా వర్సెస్ అల్లోపతి, మరో కొత్త వివాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook